Amaravati: అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా లక్ష్మీపార్థసారథి

అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌, ఎండీగా విశ్రాంత ఐఏఎస్‌ లక్ష్మీ పార్థసారథి నియమితులయ్యారు.

Updated : 27 Jun 2024 22:29 IST

అమరావతి: అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌, ఎండీగా విశ్రాంత ఐఏఎస్‌ లక్ష్మీ పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2014- 2019 మధ్య కాలంలో ఏడీసీ సీఎండీగా లక్ష్మీ పార్థసారథి వ్యవహరించారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ సహా అమరావతి అభివృద్ధిపై అవగాహన ఉండటంతో ఆమెను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని