Telangana news: తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్‌ డాక్టర్లు

తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published : 26 Jun 2024 18:16 IST

హైదరాబాద్‌: తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మె విరమణకు అంగీకరించారు. ఎనిమిది డిమాండ్లలో ఆరింటికి మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి 79.50 కోట్లు, కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని