- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pinnelli: పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్.. నెల్లూరు జైలుకు తరలింపు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నెల్లూరు జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతోపాటు, ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టగా ఈ మేరకు వాదనలు జరిగాయి. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన నాలుగు కేసుల్లో విచారణ చేపట్టారు. రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కాగా, మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన తెదేపా పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేయడంపై పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసిన కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కారంపూడి పోలీసులు కేసులు పెట్టారు. ఈ నాలుగింటిలోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇన్నాళ్లు అరెస్టు చేయకుండా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొదట జూన్ 6 వరకూ అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మే 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే 3 సార్లు పొడిగించడంతో పిన్నెల్లి పోలీసుల ఆధీనంలో ఉంటూ ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేస్తున్నారు.
ఈ వెసులుబాటు గడువు ముగియడం, బెయిల్ పిటిషన్లనూ హైకోర్టు రద్దు చేయడంతో బుధవారం నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న ఆయన్ను నరసరావుపేట రూరల్ సీఐ మల్లికార్జున్ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో కాకుండా పిన్నెల్లి సొంత కారులోనే ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఈ కేసులను విచారిస్తున్న గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు, కారంపూడి సీఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. నరసరావుపేట ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బందోబస్తు మధ్య నరసరావుపేట నుంచి గురజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. -
లింకు నొక్కారో.. ఖాతా ఖాళీ
పీఎంకిసాన్ పథకంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని డబ్బులు వచ్చాయా లేదా తెలుసుకోవచ్చని సైబర్ నేరగాళ్లు తప్పుడు లింకులు పంపుతున్నారు. -
యూజీసీ నెట్-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలను జాతీయ పరీక్ష సంస్థ (NTA) ప్రకటించింది. ఈ సారి పెన్ను పేపర్ విధానంలో కాకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. -
విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి
బాగా చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ కోరారు. మంచి నాయకులు కావాలా, వద్దా అనేది విద్యార్థులే నిర్ణయించుకోవాలని సూచించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.