Andhra news: ఏసీబీ డీజీగా అతుల్‌ సింగ్‌.. ఏపీలో పలువురు IPSల బదిలీ

ఏపీలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 28 Jun 2024 19:20 IST

అమరావతి: ఏపీలో పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీఎస్‌పీ బెటాలియన్‌ అదనపు డీజీ అతుల్‌ సింగ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా నియమించింది. విశాఖ సీపీగా ఉన్న రవిశంకర్‌ అయ్యన్నార్‌ను సీఐడీ అదనపు డీజీగా, అలాగే.. శాంతిభద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని