Andhra news: పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు.. సాంకేతిక సవాళ్లను అధిగమించే ప్రయత్నం

పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. 

Published : 30 Jun 2024 20:43 IST

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనకు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగంలోకి దిగారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు శనివారమే దిల్లీలో కేంద్ర, రాష్ట్ర జలవనరులశాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఆదివారం రాజమహేంద్రవరం చేరుకుని అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. తొలుత అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం సైట్‌ పరిశీలన చేపట్టారు. తొలి రెండ్రోజులు డయాఫ్రమ్‌ వాల్‌, రెండు కాపర్‌ డ్యామ్‌లు, గైడ్‌బండ్‌ల పరిశీలన కొనసాగనుంది. ప్రాజెక్టు డిజైన్‌ల మొదలు..ఇప్పటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. రెండ్రోజుల తర్వాత కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మేధోమథనం చేయనున్నారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఎంత నష్టం జరిగిందో చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఉండటంతో కేంద్రం.. అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దింపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని