Vijayawada: ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలు: ఈవో రామారావు

ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో రామారావు తెలిపారు.

Published : 30 Jun 2024 15:58 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జులై 6 నుంచి నెలరోజులపాటు ఆలయంలో ఆషాడమాస సారె మహోత్సవం నిర్వహించనున్నట్టు చెప్పారు.  అమ్మవారికి భక్తులు సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. జులై 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు సమర్పిస్తుందని చెప్పారు. జులై 19 నుంచి మూడు రోజులపాటు శాకాంబరీ దేవి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మహానివేదన సమయంలో ప్రోటోకాల్‌ దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని