AP High Court: వైకాపా కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రాష్ట్రంలో వైకాపా కార్యాలయాల కూల్చివేతల అంశంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Updated : 04 Jul 2024 13:57 IST

అమరావతి: రాష్ట్రంలో వైకాపా కార్యాలయాల కూల్చివేతల అంశంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కూల్చివేతల్లో చట్టనిబంధనలు పాటించాలని ఆదేశించింది. ప్రతిదశలో వైకాపా తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని పేర్కొంది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉన్న సందర్భంలో కూల్చివేతలపై ఆలోచన చేయాలని సూచించింది. తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ పలువురు వైకాపా నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని