TG news: ఆన్‌లైన్‌లోనే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణ: తెలంగాణ ప్రభుత్వం

సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

Published : 02 Jul 2024 20:30 IST

హైదరాబాద్‌: సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించనుంది. ఈ మేరకు https//cmrf.telangana.gov.in\ వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈనెల 15 వరకు ప్రజల నుంచి ఆఫ్‌లైన్‌లో వచ్చే వినతులను అధికారులు స్వీకరిస్తారు. ఆ తర్వాత నుంచి ఆన్‌లైన్‌లో మాత్రమే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనారోగ్యం బారిన పడిన వారు వైద్య చికిత్సకు ప్రభుత్వ సాయం కోసం సీఎంఆర్‌ఎఫ్‌లో దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. పరీశీలన అనంతరం ప్రభుత్వం అర్హత కలిగిన వారికి సాయం అందజేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు