TGRTC: టీజీఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ ఉద్యోగార్థులకు శుభవార్త. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

Updated : 02 Jul 2024 16:09 IST

హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిలో 2000 డ్రైవర్‌ ఉద్యోగాలు, 743 శ్రామిక్‌ ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడంపై మంత్రి పొన్న ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. 

పోస్టుల వివరాలు..

  • డ్రైవర్లు: 2000
  • శ్రామిక్‌: 743
  • డిపో మేనేజర్లు/అసిస్టెంట్ ట్రాఫిక్‌ మేనేజర్లు - 25
  • అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ - 15
  • డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) - 84
  • డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) - 114
  • అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) - 23
  • సెక్షన్ ఇంజినీర్‌ (సివిల్): 11
  • అకౌంట్స్ ఆఫీసర్ - 6
  • మెడికల్ ఆఫీసర్స్ (జనరల్) - 7
  • మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్‌) - 7

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని