Andhra news: ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 18 Jun 2024 21:34 IST

అమరావతి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటితోపాటుగా కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్‌ విద్యార్థులకు సైతం ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,08,619 మంది, ద్వితీయ సంవత్సరంలో 92,134 మంది విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది.

ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పుస్తకాల స్టాక్‌ను పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు వెలువరించింది. పంపిణీలో లోటు ఉంటే తక్షణం పుస్తకాల ముద్రణకు అనుమతిచ్చేలా చూడాలని సమగ్ర శిక్ష డైరెక్టర్‌కు సూచించింది. జులై 15 నాటికి విద్యార్థులందరికీ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని