Naresh: ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశం: సినీనటుడు నరేశ్‌

భవిష్యత్తులో ఏపీలో సినీ పరిశ్రమ వేళ్లూనుకుంటుందని, ఇక్కడ షూటింగ్‌లు చేసేందుకు తహతహలాడుతున్నారని సినీనటుడు నరేశ్‌ అభిప్రాయపడ్డారు.

Published : 03 Jul 2024 21:50 IST

విజయవాడ: భవిష్యత్తులో ఏపీలో సినీ పరిశ్రమ వేళ్లూనుకుంటుందని, ఇక్కడ షూటింగ్‌లు చేసేందుకు తహతహలాడుతున్నారని సినీనటుడు నరేశ్‌ అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు మంచి ఆదరణ లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో రోటరీ క్లబ్‌ వ్యవస్థాపక దినోత్సవంలో పవిత్రా లోకేశ్‌తో కలిసి నరేశ్‌ పాల్గొన్నారు. 

మంచి లొకేషన్లు, సహకారం ఉంటే సినీ పరిశ్రమ త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఐదేళ్లలో మంచి రాజధాని నిర్మాణం అవుతుందని, పోలవరం పూర్తవుతుందని నరేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బాహుబలి... తాజాగా కల్కి సినిమాతో తెలుగు పరిశ్రమ ఖ్యాతి ఎల్లలు దాటి ప్రపంచస్థాయికి చేరిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను 6 సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. విజయవాడను ఎకో ఫ్రెండ్లీ సిటీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న రోటరీ క్లబ్ సభ్యులను  పవిత్రా లోకేశ్ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని