TG News: జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ గడువు పెంపు?

జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ గడువును జులై 31 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం.

Updated : 02 Jul 2024 21:50 IST

హైదరాబాద్‌: జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ గడువును జులై 31 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు అంశాలపై విచారణ కోసం ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ 7న విచారణ ప్రారంభించిన కమిషన్‌.. జూన్‌ 30న నివేదిక ఇవ్వాల్సి ఉంది. కానీ, విచారణ ఇంకా పూర్తి కాలేదు. ప్రక్రియ కీలక దశలో ఉంది. విచారణ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 

ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎస్‌.ఎ.ఎం రిజ్వీని ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసి.. ఆయన స్థానంలో రొనాల్డ్‌ రోస్‌ను నియమించింది. ఇంధనశాఖతో పాటు జెన్‌ కో, ట్రాన్స్‌ కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు రొనాల్డ్‌ రోస్‌కు అప్పగించింది. ఆయన బాధ్యతలు స్వీకరించి శాఖపై అధ్యయనం చేస్తున్న క్రమంలోనే కమిషన్‌ గడువు ముగిసింది. దీంతో విచారణ కమిషన్‌ గడువు మరో నెలరోజుల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని