Engineering Counselling: ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 7వ తేదీ వరకు ప్రాసెసింగ్‌ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Published : 01 Jul 2024 11:47 IST

అమరావతి: ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 7వ తేదీ వరకు ప్రాసెసింగ్‌ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

జులై 4 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8-12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. 13న ఆప్షన్ల మార్పు, 16న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 17-22లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఇటీవల కన్వీనర్‌ నవ్య ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని