Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Jun 2024 21:08 IST

1. రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలి: సీఎం చంద్రబాబు

రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు హాజరై ప్రసంగించారు. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రామోజీరావు పాటించిన విలువలను త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తాం: ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌

ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి రామోజీరావు అని ‘ఈనాడు’ ఎండీ కిరణ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. ఆయన నమ్మిన పాటించిన విలువలను త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీ సచివాలయంలో ఐదు రోజులే పనిదినాలు.. మరో ఏడాది పొడిగింపు

రాజధాని ప్రాంత పరిధిలో రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఫైల్‌కు ఆమోదం తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన నాంపల్లి కోర్టు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్‌ పిటిషన్లపై బుధవారమే వాదనలు ముగియగా.. న్యాయస్థానం గురువారం తీర్పు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రీఛార్జి ప్లాన్ల ధరలను పెంచిన జియో... ఎప్పటి నుంచి అంటే?

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తమ టారిఫ్‌లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్లాన్‌ మీద కనిష్ఠంగా 12.5 శాతం నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు పెంచనున్నట్లు జియో గురువారం ప్రకటించింది. దాంతోపాటు కొత్త రీఛార్జి ప్లాన్లనూ తీసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. డిప్యూటీ స్పీకర్‌ పదవి ఎన్డీయేకే..!

బుధవారం జరిగిన లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. కాగా.. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌ పదవినీ తమ కూటమి ఎంపీకే ఇవ్వాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బిహార్‌లో కుంగిన వంతెన.. పది రోజుల వ్యవధిలో నాల్గో ఘటన

బిహార్‌లో వరుస వంతెన ప్రమాదాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా కిషన్‌గంజ్‌ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన ఓ వంతెన కుంగిపోయింది. దీంతో బహదుర్‌గంజ్‌, దిఘాల్‌బ్యాంక్‌ బ్లాక్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 10 రోజుల వ్యవధిలో ఇది నాల్గో ఘటన కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎన్‌టీఏ ఆఫీసులోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు.. దిల్లీలో ఉద్రిక్తత

యూజీసీ నెట్‌, నీట్‌ పీజీ వంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించిన జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా పలు విద్యార్థి సంఘాల నాయకులు దేశ రాజధాని దిల్లీలో ఆందోళన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారిలో కొందరు గురువారం ఎన్‌టీఏ ఆఫీసులోకి దూసుకెళ్లడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విరాట్ విధ్వంసం మాకు తెలుసు.. మేం ప్రిపేర్డ్‌గానే ఉన్నాం: ఇంగ్లాండ్ కోచ్

గయానా వేదికగా ప్రపంచకప్‌ రెండో సెమీస్‌లో భారత్‌-ఇంగ్లాండ్‌ తలపడుతున్నాయి. ప్రస్తుత పొట్టి కప్‌లో కోహ్లీ పెద్దగా ఫామ్‌లో లేడు. అయినా, తాము మాత్రం విరాట్‌పై ఓ కన్నేసి ఉంచుతామని ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ మాథ్యూస్ మాట్‌ వ్యాఖ్యానించాడు. అతడి విధ్వంసం గురించి తమకు తెలుసునని... అడ్డుకొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని