ramojirao: రామోజీరావు పాటించిన విలువలను త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తాం: ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌

ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి రామోజీరావు అని ‘ఈనాడు’ ఎండీ కిరణ్ అన్నారు.

Updated : 27 Jun 2024 20:42 IST

విజయవాడ: ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి రామోజీరావు అని ‘ఈనాడు’ ఎండీ కిరణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కిరణ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రజల హక్కులను పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు. దేశంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారు. ఆయన నమ్మిన పాటించిన విలువలను త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులు, నా తరఫున సభా ముఖంగా మాటిస్తున్నా. నాన్నగారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ ఇస్తున్నా. రాజధాని అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం ప్రకటిస్తున్నాం. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరు రామోజీరావుగారు సూచించారు. ఈ సభ నాన్నగారి ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా భావిస్తున్నాం. సంస్మరణ సభ నిర్వహించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని కిరణ్ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని