Pawan Kalyan: వైకాపా పాలకుల ఆర్థిక అరాచకం.. ఆ కుటుంబాలను వేదనకు గురిచేసింది: డిప్యూటీ సీఎం పవన్‌

డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం చేసిన పాపం వల్ల వారి కుటుంబాలు ఎంతో వేదనతో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు.

Updated : 27 Jun 2024 22:07 IST

విజయవాడ: డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం చేసిన పాపం వల్ల వారి కుటుంబాలు ఎంతో వేదనతో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైకాపా పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని విమర్శించారు. పీఆర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తోన్న తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని డిప్యూటీ సీఎంకు మహిళలు ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన జీతాలు చెల్లించే ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వారికి న్యాయం చేస్తానని పవన్‌ హామీ ఇచ్చారు.

విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పీఆర్‌, అర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్ విభాగాలపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ విభాగం మొదలుపెట్టిన రోడ్లు, వంతెనల పనులు, వాటికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఏషియన్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ బ్యాంకు నుంచి సమీకరించిన రుణం, వాటి వినియోగంపై అధికారులతో చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని