Andhra news: ఏపీ అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌

ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. 

Updated : 18 Jun 2024 21:48 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. 2014-19 మధ్య కాలంలో తెదేపా అధికారంలో ఉన్న సమయంలో ఆయనే ఏజీగా వ్యవహరించారు. తాజాగా మళ్లీ తెదేపా అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు దమ్మాలపాటినే ఎంపిక చేశారు. ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ అడ్వకేట్‌ జనరల్‌గా ఎంపికైన దమ్మాలపాటి శ్రీనివాస్‌కు నందమూరి రామకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ అభివృద్ధికి అడ్డువచ్చే చీడ పురుగులను శ్రీనివాస్‌ శిక్షించాలని ఆయన ఆకాంక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని