- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
మేషం
ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనసు చెడు విషయాలపైకి మళ్లకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
వృషభం
మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఇష్టదైవధ్యానం మేలు చేస్తుంది.
మిథునం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ఫర్వాలేదనిపిస్తుంది. పెద్దల సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. గోసేవ చేయడం మంచిది.
కర్కాటకం
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
సింహం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అష్టమంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.
కన్య
కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి,వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంది. శ్రీలక్ష్మీస్తుతి శ్రేయస్కరం.
తుల
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు. శ్రీవేంకటేశ్వర సందర్శనం ఉత్తమం.
వృశ్చికం
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. శ్రీవిష్ణు నామస్మరణ శుభప్రదం.
ధనుస్సు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహావేశాలకు పోవద్దు. తోటివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు. శని ధ్యానం చేయాలి.
మకరం
శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
కుంభం
కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.
మీనం
మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. జన్మచంద్ర సంచారం అనుకూల లాభాలను ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన శ్రేయస్కరం.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచకప్ పూనకాలు.. సచివాలయం వద్ద సంబరాలు ఇవీ..
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పెద్ద ఎత్తున చేరుకున్న క్రికెట్ అభిమానులు కేరింతలు కొట్టారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కల్తీసారా విక్రయాలపై తమిళనాడు ఉక్కుపాదం
-
ప్రపంచకప్ పూనకాలు.. సచివాలయం వద్ద సంబరాలు ఇవీ..
-
అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రోహిత్ శర్మ వీడ్కోలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/06/24)
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. చరిత్రలో నిలిచిపోతాయి ఈ ఓవర్లు
-
టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ