Pinnelli ramakrishna reddy: పోలీస్‌ కస్టడీకి పిన్నెల్లి.. అనుమతించిన కోర్టు

ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.

Updated : 05 Jul 2024 21:25 IST

మాచర్ల: ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. అదనపు విచారణ కోసం పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరగా మాచర్ల కోర్టు న్యాయమూర్తి అందుకు అంగీకరించారు. దీంతో పిన్నెల్లిని రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. 

మే 13న పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రెచ్చిపోయారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు. బయటకు వస్తున్న సమయంలో చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ నిలదీయటంతో ఆమెను తీవ్రంగా హెచ్చరిస్తూ దుర్భాషలాడారు. దీనిపై రెంటచింతల పోలీసులు 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేశారు. దీనిపై ఎమ్మెల్యే, మరో 15 మందిపై సెక్షన్‌ 307, 147, 148, 120బీ, 324, రెడ్‌విత్‌ 149 ఐపీసీ కింద రెంటచింతల పీఎఎస్‌లో కేసు నమోదైంది. తనను చంపేయాలని పిన్నెల్లి వైకాపా శ్రేణుల్ని ఉసిగొల్పినట్టు శేషగిరిరావు ఫిర్యాదు చేశారు. ఈకేసులో రామకృష్ణారెడ్డిని ఏ-1గా చేర్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని