Revanth Reddy: అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం: రేవంత్‌రెడ్డి

అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Published : 05 Jul 2024 21:36 IST

హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనలు, డిమాండ్లపై ఆయన పార్టీ విద్యార్థి, యువజన నేతలు, అధికారులతో చర్చించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలికావొద్దని విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయంలో నిబంధనలు మారిస్తే తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం 28,942 నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. పరీక్షల తేదీలపై టీజీపీఎస్‌సీ, విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని