CM Ramesh: ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం: సి.ఎం.రమేశ్‌

 వీసీ ప్రసాదరెడ్డి రాజీనామాతో ఆంధ్రా వర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు.

Updated : 29 Jun 2024 16:46 IST

విశాఖ: వీసీ ప్రసాదరెడ్డి రాజీనామాతో ఆంధ్రా వర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. భాజపా ఎంపీ సి.ఎం. రమేశ్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు అక్కడికి వెళ్లారు. నాయకులకు ఆంధ్రా వర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు ఘన స్వాగతం పలికారు.

ఏయూలో విద్యార్థుల అభివృద్ధికి దోహదపడే పాలకవర్గం ఉంటుందని సి.ఎం.రమేశ్‌ తెలిపారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తామన్నారు. అవినీతిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

ఏయూలో మళ్లీ పూర్వ పరిస్థితులు రప్పిస్తామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టారని, నియామకాలు చేశారని ఆరోపించారు. ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు