Chandrababu: ఆ సైనికుల మరణం తీవ్రంగా కలచివేసింది: చంద్రబాబు

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు.

Updated : 01 Jul 2024 19:36 IST

అమరావతి: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. లద్దాఖ్‌లోటీ-72 యుద్ధ ట్యాంకు కొట్ట్టుకుపోయిన ఘటనలో రాష్ట్రానికి చెందిన జవాన్లు రామకృష్ణారెడ్డి, నాగరాజు, సుభాన్‌ ఖాన్‌ మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. లద్ధాఖ్‌లో నదిదాటే ప్రయత్నంలో సైనికులు చనిపోయారన్న ఘటన తనను కలచివేసిందన్నారు. 

లద్దాఖ్‌లో జరిగిన ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్ల మృతి పట్ల మంత్రి లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేశ్‌ హామీ ఇచ్చారు. 

ఈ ముగ్గురు జవాన్ల పార్థివదేహాలను గ్వాలియర్‌ నుంచి విజయవాడకు ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో తీసుకొచ్చిన అధికారులు.. వారి స్వస్థలాలకు తరలించారు. సుభాన్‌ఖాన్‌ పార్థివ దేహాన్ని రేపల్లె మండలం ఇస్లాంపూర్‌కు తీసుకెళ్లగా.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సుభాన్‌ఖాన్‌కు మంత్రి అనగాని సత్యప్రసాద్‌, ఆర్మీ అధికారులు నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని