Chandrababu: నేడు పోలవరంపై శ్వేతపత్రం.. విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరంపై ఏపీ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఏడు ప్రభుత్వశాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Updated : 28 Jun 2024 11:05 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరంపై ఏపీ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఏడు ప్రభుత్వశాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పోలవరంపై సీఎం చంద్రబాబు (Chandrababu) శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను వెల్లడించనున్నారు.  

సీఎంగా ప్రమాణ స్వీకారం తరువాత చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటనకు పోలవరం వెళ్లారు. అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసంపై వివరాలను శ్వేతపత్రం ద్వారా వెల్లడించనున్నారు. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయనున్నారు. జగన్‌ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం రూపొందించారు. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖలపై నేటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. అమరావతి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం తొలి సమీక్ష చేయనున్నారు. శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాల ప్రణాళికపై మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, అధికారులతో చర్చించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని