Chandrababu: నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు అవుతుందని.. పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Published : 03 Jul 2024 14:06 IST

అమరావతి: ఏపీ వ్యాప్తంగా 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగవుతోందని.. పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఖరీఫ్‌ సీజన్‌ కార్యాచరణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘‘నకిలీ విత్తనాలకు చెక్‌పెట్టాలి. అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలి’’ అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని