ANU: ఏఎన్‌యూ వీసీ రాజీనామా.. వర్సిటీలో సంబరాలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) వీసీ రాజశేఖర్‌ ఎట్టకేలకు పదవి నుంచి తప్పుకొన్నారు.

Published : 01 Jul 2024 14:35 IST

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) వీసీ రాజశేఖర్‌ ఎట్టకేలకు పదవి నుంచి తప్పుకొన్నారు. రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించిన ఆయన.. నేడు ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. దీంతో వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు సంబరాలు చేసుకున్నారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద బాణసంచా కాల్చారు.

వీసీ గతంలో వైకాపాకు అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రాజధానులకు మద్దతుగా సదస్సులు పెట్టారు. వర్సిటీలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసి సజ్జల, వైకాపా నేతలతో ఆవిష్కరింపజేశారు. విశ్వవిద్యాలయంలో ఆచార్యులు, ఉద్యోగుల నియామకాల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. రూసా నిధులను యూనివర్సిటీ అభివృద్ధి, విద్యా సంబధిత కార్యకలాపాల కోసం వినియోగించకుండా దారి మళ్లించారు. రాజకీయ కార్యకలాపాలకు విశ్వవిద్యాలయాన్ని వేదికగా మార్చారంటూ ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వీసీ రాజశేఖర్ రాజీనామాతో వర్సిటీకి మంచి రోజులు వచ్చాయని ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు