Nara Lokesh: హైదరాబాద్‌లో లైఫ్‌ ట్యాక్స్‌ సమస్యను పరిష్కరించండి.. లోకేశ్‌కు క్యాబ్ డ్రైవర్ల వినతి

ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేశ్‌ను హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ క్యాబ్‌ డ్రైవర్లు కలిశారు.

Updated : 02 Jul 2024 13:34 IST

అమరావతి: ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేశ్‌ను హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ క్యాబ్‌ డ్రైవర్లు కలిశారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో తమ వాహనాలకు మళ్లీ లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లించాలని అక్కడి అధికారులు చెబుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికే వాహనాలకు లైఫ్‌ ట్యాక్స్‌ కట్టామన్నారు. మరోసారి లైఫ్‌ ట్యాక్స్‌ కట్టడం వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టపోతామని విన్నవించారు. హైదరాబాద్‌లో ఏపీ వాహనాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 6న జరగనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి భేటీలో తమ సమస్యకు పరిష్కారం లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో తమ వాహనాలకు మరికొంతకాలం వెసులుబాటు కల్పించాలని కోరారు.

లోకేశ్‌కు ఉపాధ్యాయుల వినతి

ప్రజాదర్బార్‌లో లోకేశ్‌ను ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిశారు. కోడ్‌ వల్ల నిలిచిన బదిలీ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ‘‘గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి జరిగింది. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ బదిలీలు చేపడతాం. ఉపాధ్యాయ బదిలీల అంశంలో తాను చెడ్డ పేరు తెచ్చుకోదల్చుకోలేదు’’ అని టీచర్లతో లోకేశ్ వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు