Bhatti Vikramarka: హైదరాబాద్‌ నుంచి విదేశాలకు పెద్దఎత్తున ఫార్మా ఎగుమతులు: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌ నుంచి పెద్దఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Updated : 05 Jul 2024 14:18 IST

హైదరాబాద్‌: నగరం నుంచి పెద్దఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ఇండియన్‌ ఫార్మాస్యుటికల్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫార్మా క్లస్టర్లను ఓఆర్‌ఆర్‌ వెలుపల ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ రంగంలో కొత్త విధానాలు తీసుకువస్తామని తెలిపారు.  

ఫార్మా రంగానికి కేంద్రంగా హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్‌బాబు

ఫార్మా రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. దేశ, విదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పెట్టుబడిదారులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. ఏఐను అందిపుచ్చుకోవడానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు.

పారిశ్రామికవేత్తలు ‘సీఎస్‌ఆర్‌’తో తోడ్పాటు అందించాలి: మంత్రి కోమటిరెడ్డి

వైఎస్ఆర్‌ హయాంలో ఓఆర్‌ఆర్‌ నిర్మించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దాంతో హైదరాబాద్‌కు ఎన్నో ఐటీ పరిశ్రమలు వచ్చాయన్నారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం కూడా చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సీఎస్ఆర్‌ (సామాజిక బాధ్యత)లో భాగంగా తోడ్పాటు అందించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని