Andhra news: కలకలం రేపిన ఏపీఎండీసీ దస్త్రాలు దహనం.. పెద్దిరెడ్డి అనుచరులపై అనుమానం

విజయవాడ శివారు పెదపులిపాక కరకట్ట వద్ద ఫైల్స్‌ దహనం ఘటన కలకలం రేపింది.

Published : 03 Jul 2024 22:25 IST

అమరావతి: విజయవాడ శివారు పెదపులిపాక కరకట్ట వద్ద ఫైల్స్‌ దహనం ఘటన కలకలం రేపింది. అవి మైనింగ్‌శాఖకు చెందిన దస్త్రాలుగా అనుమానిస్తున్నారు. కృష్ణా నది ఇసుక తిన్నెల వద్ద కారు ఆపి ఫైల్స్‌ తగలబెడుతుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో అక్కడి వెళ్లి ప్రశ్నించడంతో కారులో వచ్చిన వారు పరారయ్యారు. ఈ సమాచారం ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు తెలియడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. దగ్ధమైన ఫైళ్లు గనులశాఖకు చెందినవిగా గుర్తించారు. ఏపీ ఎండీసీ దస్త్రాలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే దహనం చేయాలని చూశారని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వాటిని కాల్చిపారేసే యత్నం చేసినట్లు తెలుస్తోంది. పలు దస్త్రాలు, హార్డ్‌ డిస్కులు కాలిపోయాయని ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ తెలిపారు. అధికారులు విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని