AP PSC: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ రాజీనామా

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Updated : 03 Jul 2024 22:09 IST

అమరావతి: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బుధవారం ఆమోదించినట్టు సమాచారం. వైకాపా హయాంలో సవాంగ్‌ కొంతకాలం డీజీపీగా కొనసాగారు. 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు పదవిలో ఉన్న ఆయన ఉద్యోగ విరమణకు రెండేళ్ల ముందే రాజీనామా చేశారు. అనంతరం సవాంగ్‌ను అప్పటి వైకాపా ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది. 2022 మార్చిలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

వైకాపాతో అంటకాగిన అధికారిగా గౌతమ్‌ సవాంగ్‌ ముద్ర వేసుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో డీజీపీగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైకాపా నేతలు రాళ్ల దాడికి యత్నిస్తే.. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని