Andhra news: ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలు తయారు చేస్తున్నాం: మంత్రి కొల్లు రవీంద్ర

ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 

Updated : 03 Jul 2024 18:27 IST

అమరావతి: ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత అయిదేళ్లూ ఇసుకను అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా సులభంగా అందేలా చూస్తాం. వైకాపా అధికారంలోకి వచ్చినప్పుడు తొమ్మిది నెలల పాటు ఎవరికీ ఇసుక దక్కలేదు. 40 రంగాలు వారు దీనిపై ఆధారపడ్డారనే విషయాన్ని పట్టించుకోలేదు. లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయారు. నిధులు దోచుకోవాలనే ఉద్దేశంతో జేపీ సంస్థను తెర మీదకు తీసుకొచ్చారు. తర్వాత రకరకాలుగా దోపిడీకి పాల్పడ్డారు. ఎన్జీటీ వరకు ఈ వ్యవహారం వెళ్లింది.

వర్షాకాలంలో కూడా ఇసుక లభ్యత ఉండేలా చూస్తాం. ఇసుక లోటు రాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించి విధి విధానాలు తయారు  చేస్తున్నాం. ఎవరైనా బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. 2014-19 కాలంలో ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది తెదేపా ప్రభుత్వమే. వైకాపా అధికారంలోకి వచ్చాక దాన్ని దోచుకోవడానికి వాడుకుంది. ఈ విధానంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని