YSJagan: జగన్‌కు మితిమీరిన భద్రతపై ఫిర్యాదులు.. ఏపీ ప్రభుత్వం ఆరా!

ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మితిమీరిన భద్రతపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

Updated : 24 Jun 2024 21:04 IST

అమరావతి: ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మితిమీరిన భద్రతపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడాలేని విధంగా భారీ భద్రత కల్పించుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. సెక్యూరిటీ మాన్యువల్‌ ఉల్లంఘించారని, ప్రధానికి కూడా లేనంతగా భద్రత ఏర్పాటు చేసుకున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. తాడేపల్లి, హైదరాబాద్‌, పులివెందులలోని ప్యాలెస్‌ల వద్ద 986 మందితో భారీగా భద్రత ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి ప్యాలెస్‌లో 30 అడుగుల ఐరన్‌ వాల్‌ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆయన భద్రత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని