Chandrababu: ఏపీలో పింఛన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా జులై 1న జరగనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (Chandrababu) పాల్గొననున్నారు.

Published : 29 Jun 2024 20:10 IST

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా జులై 1న జరగనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (Chandrababu) పాల్గొననున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పింఛను లబ్ధిదారులు, ప్రజలతో సీఎం ముచ్చటించనున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు కానున్నారు. మరోవైపు జులై 1న పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తి కావాలని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని