Chandrababu: ప్రధాని మోదీతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నా: చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మరోసారి అరకు కాఫీ ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Updated : 30 Jun 2024 18:46 IST

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మరోసారి అరకు కాఫీ ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గిరిజనులు పండించే అరకు కాఫీ గొప్పతనం గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి విశాఖలో అరకు కాఫీ రుచి చూసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. మోదీ ట్వీట్‌పై స్పందించిన చంద్రబాబు.. అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని పేర్కొన్నారు. ఇది గిరిజన సాధికారత, ఆవిష్కరణల సమ్మేళనాన్ని సూచిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అపరమితమైన సామర్థ్యానికి ప్రతిబింబమని స్పష్టం చేశారు. దీన్ని గుర్తించి మేడ్ ఇన్ ఆంధ్ర ఉత్పత్తిని ఆమోదించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని