Revanth Reddy: త్వరలో వారానికో జిల్లా పర్యటన.. కలెక్టర్లు ఆఫీసు దాటడం లేదు: రేవంత్‌

తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Updated : 02 Jul 2024 22:28 IST

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలపై ఆలోచించాలని చెప్పారు. రెండు వారాల్లో ప్రతి అధికారి ఒక ఫ్లాగ్‌షిప్‌ ఐడియా ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్య కార్యదర్శులు వారానికొకసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలన్నారు. 

చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకోసారి జిల్లా అధికారులతో పనుల పురోగతిపై చర్చించాలని సూచించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లను కలెక్టర్లు తప్పనిసరిగా సందర్శించాలన్నారు. ప్రజా సమస్యలు, దుర్ఘటనలపై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. పనితీరు ఆధారంగానే అధికారులకు ఉన్నత అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. త్వరలో వారానికొక జిల్లా పర్యటనకు వెళ్తానని సీఎం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని