AP News: అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్‌ జారీ

అమరావతి ప్రాంతంలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్‌ జారీ చేశారు.

Updated : 29 Jun 2024 14:00 IST

అమరావతి: అమరావతి ప్రాంతంలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్‌ జారీ చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్‌ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా జోనింగ్‌ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్‌ 39 ప్రకారం బహిరంగ ప్రకటనను జారీ చేసింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్‌ భాస్కర్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని