icon icon icon
icon icon icon

సికింద్రాబాద్

Published : 12 Apr 2024 14:41 IST

లోక్‌సభ నియోజకవర్గం

సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం (Secunderabad Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్‌ కేటగిరీలో ఉంది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి.

2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన జి.కిషన్‌రెడ్డి విజయం సాధించి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం భాజపా నుంచి మరోసారి కిషన్‌రెడ్డి పోటీలో ఉండగా, భారాస టి.పద్మారావు గౌడ్‌కు అవకాశం కల్పించింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి దానం నాగేందర్‌ పోటీలో నిలిచారు. భారాస, కాంగ్రెస్‌నుంచి పోటీ చేస్తున్న ఇద్దరూ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. దానం నాగేందర్‌ భారాస అభ్యర్థిగా ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసి, ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ వెంటనే సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని పార్టీ కల్పించింది.

  • ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు-పార్టీలు
  • 1957: అహ్మద్ మొహిద్దీన్- కాంగ్రెస్
  • 1962: అహ్మద్ మొహిద్దీన్- కాంగ్రెస్
  • 1967: బకర్ అలీమిర్జా-కాంగ్రెస్
  • 1971: ఎమ్ఎమ్.హషీమ్-తెలంగాణ ప్రజా సమితి
  • 1977: ఎమ్ఎమ్.హషీమ్-కాంగ్రెస్
  • 1980: పి. శివ్‌కుమార్-కాంగ్రెస్
  • 1984: టి. అంజయ్య-కాంగ్రెస్
  • 1989: టి. మణియమ్మ-కాంగ్రెస్
  • 1991: బండారు దత్తాత్రేయ-భాజపా
  • 1996: పీవీ రాజేశ్వరరావు-కాంగ్రెస్
  • 1998: బండారు దత్తాత్రేయ-భాజపా
  • 1999: బండారు దత్తాత్రేయ-భాజపా
  • 2004: ఎమ్.అంజన్‌కుమార్ యాదవ్-కాంగ్రెస్
  • 2009: ఎమ్.అంజన్‌కుమార్ యాదవ్-కాంగ్రెస్
  • 2014: బండారు దత్తాత్రేయ-భాజపా
  • 2019: జి.కిషన్‌రెడ్డి (భాజపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img