icon icon icon
icon icon icon

మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం (Mahabubnagar Lok Sabha constituency) 1952లో ఏర్పాటైంది.

Updated : 09 May 2024 14:48 IST

లోక్‌సభ నియోజకవర్గం

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అలంపూర్, గద్వాల, వనపర్తి శాసనసభా నియోజకవర్గాలు నాగర్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో కలపగా, నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గాలు మహబూబ్‌నగర్‌లో కలిశాయి.
మహబూబ్‌నగర్‌ మొదటి నుంచి జనరల్‌ కేటగిరిలో ఉంది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం కొడంగల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి.

పాత ప్రత్యర్థులు.. కొత్త సమీకరణాలు

ప్రస్తుతం భాజపా నుంచి డీకే అరుణ్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి, భారాస నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి వంశీచంద్‌రెడ్డి, భాజపా నుంచి డీకే అరుణ, భారాస నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేశారు. ఇప్పుడూ అదే పార్టీల నుంచి వీరే మరోసారి బరిలో నిలిచారు. 2019లో రాష్ట్రంలో భారాస ప్రభుత్వం ఉండగా ఈసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది.  ఈసారి ప్రధాన పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశాలున్నాయి. 2019లో మన్నె శ్రీనివాస్‌రెడ్డికి 4,11,241, డీకే అరుణకు 3,33,121, వంశీ చంద్‌రెడ్డికి 1,93,513 ఓట్లు పోలయ్యాయి. భాజపా అభ్యర్థి డీకే అరుణపై భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి 78,120 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వంశీచంద్‌ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ సారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

  • మహబూబ్‌నగర్‌లో ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు
  • 1952: కె.జనార్థన్‌రెడ్డి
  • 1957:  జె.రామేశ్వరరావు(కాంగ్రెస్)
  • 1962: జె.బి.ముత్యాలరావు(కాంగ్రెస్)
  • 1967: జె. రామేశ్వరరావు(కాంగ్రెస్)
  • 1971: జె. రామేశ్వరరావు(కాంగ్రెస్)
  • 1977: జె. రామేశ్వరరావు(కాంగ్రెస్)
  • 1980: మల్లికార్జున్ గౌడ్‌ (కాంగ్రెస్)
  • 1984: ఎస్. జైపాల్‌రెడ్డి(జనతాపార్టీ)
  • 1989: మల్లికార్జున్ గౌడ్‌ (కాంగ్రెస్)
  • 1991: మల్లికార్జున్ గౌడ్‌(కాంగ్రెస్)
  • 1996: మల్లికార్జున్ గౌడ్‌(కాంగ్రెస్)
  • 1998: ఎస్. జైపాల్‌రెడ్డి(జనతాపార్టీ)
  • 1999: ఏపీ జితేందర్‌రెడ్డి(భాజపా)
  • 2004: డి విఠల్‌రావు(కాంగ్రెస్)
  • 2009: కె చంద్రశేఖర్‌రావు(తెరాస)
  • 2014: జితేందర్‌రెడ్డి(తెరాస)
  • 2019: మన్నె శ్రీనివాస్‌రెడ్డి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img