icon icon icon
icon icon icon

మహబూబాబాద్

నియోజకవర్గాల పునర్విభజనతో వరంగల్ జిల్లాలో కొత్తగా మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది.

Updated : 26 Apr 2024 15:17 IST

మహబూబాబాద్‌ (Mahabubabad Lok Sabha constituency) స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇల్లెందు ఖమ్మం లోక్‌సభ పరిధిలోనూ, భద్రాచలం, పినపాక అసెంబ్లీ సెగ్మెంట్లు భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గంలో ఉండేవి. ఈ మూడింటిని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లను కలిపి మహబూబాబాద్ లోక్‌సభ స్థానం కొత్తగా ఏర్పాటుచేశారు.

లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు దీని పరిధిలో ఉన్నాయి. వీటిలో వరంగల్ జిల్లాకు చెందిన నర్సంపేట ఒక్కటే జనరల్ స్థానం కాగా,  ములుగు, మహబూబాబాద్, డోర్నకల్‌లతో పాటు ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేసినవే.

2009లో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పొరిక బలరాం నాయక్ గెలుపొంది.. కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌పై తెరాస అభ్యర్థి సీతారాం నాయక్‌ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెరాస నుంచి కవిత మాలోత్‌ గెలుపొందారు.

తాజా ఎన్నికల్లో భాజపా నుంచి అజ్మీరా సీతారాం నాయక్‌, కాంగ్రెస్‌ నుంచి బలరాం నాయక్‌, తెరాస నుంచి మాలోత్‌ కవిత బరిలో ఉన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బలరాం నాయక్‌ నాలుగోసారి బరిలోకి దిగుతుండటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img