icon icon icon
icon icon icon

కరీంనగర్

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

Published : 03 May 2024 14:56 IST

కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ప్రస్తుతం ఇది జనరల్‌ కేటగిరిలో ఉంది.

లోక్‌సభ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు: హుస్నాబాద్, హుజురాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. 2019 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌పై భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ గెలుపొందారు.

ప్రస్తుతం భాజపా నుంచి బండి సంజయ్‌ (Bandi sanjay kumar) మరోసారి పోటీ చేస్తుండగా, భారాస బోయినపల్లి వినోద్‌ను (Boianapalli Vinod Kumar) బరిలోకి దింపింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. మరొక రోజులో నామినేషన్ల గడువు ముగుస్తుందనగా, అనూహ్య పరిణామాల మధ్య వెలిచాల రాజేంద్రరావును (Velichala Rajender Rao) ఎంపిక చేసింది.

  • గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే!
  • 1952 (ద్వి) బద్దం ఎల్లారెడ్డి పీడీఎఫ్, ఎం.ఆర్.కృష్ణ (ఎంసీఎఫ్)
  • 1957 (ద్వి) ఎం.ఆర్.కృష్ణ, ఎం.శ్రీరంగారావు (కాంగ్రెస్)
  • 1962 జె.రమాపతిరావు  (కాంగ్రెస్)
  • 1967 జె.రమాపతిరావు  (కాంగ్రెస్)
  • 1971 ఎం.సత్యనారాయణరావు తెలంగాణ ప్రజా సమితి
  • 1977 ఎం.సత్యనారాయణరావు  (కాంగ్రెస్)
  • 1980 ఎం.సత్యనారాయణరావు (కాంగ్రెస్)
  • 1984 జువ్వాడి చొక్కారావు  (కాంగ్రెస్)
  • 1989 జువ్వాడి చొక్కారావు  (కాంగ్రెస్)
  • 1991 జువ్వాడి చొక్కారావు  (కాంగ్రెస్)
  • 1996 ఎల్.రమణ (తెదేపా)
  • 1998 చెన్నమనేని విద్యాసాగర్‌రావు (భాజపా)
  • 1999 చెన్నమనేని విద్యాసాగర్‌రావు (భాజపా)
  • 2004 కె.చంద్రశేఖర్‌రావు (తెరాస)
  • 2009 పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్)
  • 2014 బి.వినోద్‌ (తెరాస)
  • 2019 బండియ సంజయ్‌కుమార్‌ (భాజపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img