logo

పోలీసుశాఖ స్థలాల ధారాదత్తంపై నివ్వెరపోయిన డీజీపీ

కడప నగరంలోని పోలీసుశాఖ స్థలాలను వైకాపా నేతలకు ధారాదత్తం చేయడంపై డీజీపీ ద్వారకా తిరుమలరావు నివ్వెరపోయారు.

Published : 05 Jul 2024 03:09 IST

కడప నగరంలోని పరిస్థితులపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు

డీజీపీ ద్వారకా తిలమలరావుకు ఫిర్యాదు అందిస్తున్న తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

ఈనాడు, కడప: కడప నగరంలోని పోలీసుశాఖ స్థలాలను వైకాపా నేతలకు ధారాదత్తం చేయడంపై డీజీపీ ద్వారకా తిరుమలరావు నివ్వెరపోయారు. తమ శాఖ స్థలాలను ఇతరులకు కట్టబెట్టే విధానమే లేదని, చరిత్రలోనూ జరగలేదంటూ డీజీపీ అభిప్రాయపడ్డారు. విజయవాడలో డీజీపీ ద్వారకా తిరుమలరావును గురువారం తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గురువారం కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. కడప నగరంలోని రాజారెడ్డివీధిలో అత్యంత ఖరీదైన పోలీసుశాఖ స్థలంలో వైకాపా నేతలు నిర్మాణాలు చేపట్టారని, అనుమతులిచ్చిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన డీజీపీ విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆస్తిని సైతం స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో సీఐలు అశోక్‌రెడ్డి, కె.రాజులు భూదందాలతోపాటు సివిల్‌ పంచాయతీల్లో తలదూర్చడం, జూదాలు, మట్కాలను ప్రోత్సహించడం ద్వారా రూ.కోట్లు సంపాదించారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని