logo

వైకాపా పాపం... విద్యార్థులకు శాపం!

బి.కోడూరు మండలం సగిలేరు అంబేడ్కర్‌ గురుకుల కళాశాల గదులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Published : 05 Jul 2024 03:07 IST

బి.కోడూరు మండలం సగిలేరు అంబేడ్కర్‌ గురుకుల కళాశాల గదులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. నాడు-నేడు పనుల్లో భాగంగా రూ.30 లక్షలతో సుందరంగా తీర్చిదిద్దామని గత వైకాపా ప్రభుత్వ పాలకులు గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలిస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి. కనీస మౌలిక వసతుల్లేకపోవడంతో 600 మంది విద్యార్థుల సామర్థ్యంతో నిర్మించిన ఈ గురుకులం కేవలం 230 మందికే పరిమితమైంది. కేవలం రంగులేసి బిల్లుల రూపంలో రూ.లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం గమనార్హం. ఈ విషయమై ప్రిన్సిపల్‌ వరప్రసాద్‌ మాట్లాడుతూ కళాశాలలో శిథిలావస్థకు చేరిన గదులను కూల్చేసేందుకు అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.    

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, బద్వేలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని