logo

కుంచె పోసిన ప్రాణం... సుందర గ్రామీణ జీవనం

పుట్టుకతోనే ఎవరూ చిత్రకారులు కాలేరు. ఎంతో శ్రమించాలి. గురువుల శిక్షణ అవసరం. అప్పుడే పరిణితి చెందిన నైపుణ్య కళాకారులు కాగలరు.

Published : 05 Jul 2024 03:13 IST

సునంద గీసిన అపురూప చిత్రాలకు ప్రథమ బహుమతి   
సౌత్‌ జోన్‌ యువజనోత్సవాల్లో పతకాల పంట  
న్యూస్‌టుడే, మైదుకూరు 

తాను వేసిన చిత్రాలతో ఎద్దుల సునంద

పుట్టుకతోనే ఎవరూ చిత్రకారులు కాలేరు. ఎంతో శ్రమించాలి. గురువుల శిక్షణ అవసరం. అప్పుడే పరిణితి చెందిన నైపుణ్య కళాకారులు కాగలరు. అయితే మైదుకూరు మండలం నానుబాలపల్లె ఎస్సీకాలనీకి చెందిన ఎద్దుల సునంద చిత్రలేఖనంపై అభిరుచి పెంచుకుని రాణిస్తున్నారు. పోటీల్లో పాల్గొంటూ బహుమతులు, అవార్డులు అందుకుంటున్నారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, జీవయ్య. వ్యవసాయ కుటుంబం. స్వగ్రామంలో ప్రాథమిక, దువ్వూరులో ఉన్నత పాఠశాల విద్య, బద్వేలులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్‌ చదివారు. అయిదో తరగతి చదివే సమయంలో పెన్సిల్, పెన్నులతో బొమ్మలు గీసే సునంద చదువుతోపాటు అప్పుడప్పుడు వేసే బొమ్మలు చూసిన ఉపాధ్యాయుడు ఒకరు చిత్రలేఖనంలో రాణించే అందులో డిగ్రీ విశ్వ విద్యాలయంలో బ్యాచులర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో చేరారు. నాలుగేళ్లపాటు సాగిన విద్యలో చిత్రలేఖనం, మట్టితో బొమ్మలు తయారీలోనే మెలకువలను నేర్చుకున్నారు.

సౌత్‌జోన్‌ యూత్‌ ఫెస్టివల్‌లో ప్రథమ బహుమతి

పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో 2021-22లో సౌత్‌జోన్‌ యూత్‌ ఫెస్టివల్‌ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో ప్రథమ బహుమతిని సాధించారు. విశ్వ విద్యాలయంలో జరిగిన పోటీలోనూ ప్రథమ బహుమతి పొందారు. సీపీ బ్రౌన్‌ గ్రంథాలయం ఆధ్వర్యంలో 1999-20లో నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి, 2000-21లో నిర్వహించిన పోటీలో ద్వితీయ స్థానం పొందినట్లు వివరించారు. యోగివేమన విశ్వ విద్యాలయంలో బ్యాచులర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చేసిన సునంద పోస్టుగ్రాడ్యుయేషన్‌ ప్రవేశ పరీక్షలో మూడో ర్యాంకు సాధించారు. ప్రస్తుతం నంద్యాలలోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో డ్రాయింగ్‌ మాస్టర్‌గా బోధిస్తున్నారు.

పల్లె వాతావరణంపై మక్కువ

మా తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. నేను పల్లెలోనే పెరిగాను. పచ్చని పొలాలు, వాటి గట్లు, గడ్డిమోపులు ఎత్తుకుని నడుచుకుంటే వచ్చే మహిళలు, పొగమంచు సమయంలో పల్లెల్లో నెలకొన్న వాతావరణం అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ ప్రజల జీవనం నాకు మక్కువ. అదే ఇతివృత్తంగా తీసుకుని బొమ్మలు వేస్తూ ఉంటాను. ఇప్పటికి వందకు పైగా చిత్రాలు వేశాను. గ్రామీణ సౌందర్యాన్ని చూపే చిత్రాలే అందులో ఎక్కువగా ఉన్నాయి. ఉపాధి కోసం ఉద్యోగ అన్వేషణ చేస్తూనే ఉత్తమ కళాకారిణి కావాలన్నదే నా లక్ష్యం.

 సునంద, చిత్ర కళాకారిణి, మైదుకూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని