logo

ఆసుపత్రి భవనానికి రూ.కోట్లు... తెరిచిన ఆరు నెలలకే తూట్లు...!

వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.కోట్లతో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయనడానికి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాలే నిదర్శనం.

Published : 03 Jul 2024 04:13 IST

న్యూస్‌టుడే, సర్వజన ఆసుపత్రి  : వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.కోట్లతో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయనడానికి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాలే నిదర్శనం. వీటిని గతేడాది డిసెంబరులో అప్పటి సీఎం జగన్‌ ప్రారంభించడం గమనార్హం. ఆరు నెలలు కాక ముందే ఇటీవల కురిసిన వర్షాలకు భవనాలపై నీళ్లు నిలిచి ప్రధాన విభాగం కార్డియాలజీ ల్యాబ్‌ (క్యాథ్‌ల్యాబ్‌)లోకి చేరాయి. రూ.కోట్లు విలువ చేసే ఖరీదైన పరికరాలుండే గుండె శస్త్రచికిత్సలు నిర్వహించే ఈ విభాగం భవనం పైకప్పునకు వారం రోజుల కిందట మరమ్మతులు చేపట్టగా నాసిరకం పనులు బయటపడ్డాయి.

క్కడ చిన్నపాటి గుంతలుండడంతో హడావుడిగా సిమెంటు పూత పనులు చేపట్టారు. అధికారులు మాత్రం ఇవి చిన్నపాటి రంధ్రాలేనని కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల కిందట కురిసిన వర్షానికీ భవనం పైభాగంలో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో రూ.వందల కోట్లతో ఏపీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ చంద్రారెడ్డి మాట్లాడుతూ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో విద్యుత్తు పనులు పూర్తి చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో రంధ్రాలు పెట్టారని, వాటి ద్వారానే వర్షపునీళ్లు చేరాయని, వాటిని పూడ్చివేశామన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని