logo

ఆగడం లేదు... ఆపడం లేదు!

గత వైకాపా ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడిన వైకాపా నాయకులు నేటికీ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు.

Published : 03 Jul 2024 03:45 IST

జిల్లాలోని నదుల్లో కొనసాగుతున్న వైకాపా నేతల ఇసుక దందా 
న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ, వీరబల్లి, రామాపురం


త వైకాపా ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడిన వైకాపా నాయకులు నేటికీ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమి పాలై ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వైకాపా నేతల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇసుక మాఫియాలా తయారై రాత్రి వేళ అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వం అవలంభిస్తున్న ఇసుక పాలసీపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఇసుక క్వారీలను తాత్కాలికంగా మూసి వేశారు. ఈ నేపథ్యంలో రాజంపేట పట్టణానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోని చెయ్యేరు నదీతీరంలోని మందరం రేవు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడం గమనార్హం. ట్రాక్టరు ఇసుక రూ.6 వేల నుంచి రూ.8 వేలు వరకు, టిప్పరు రూ.15 వేలు నుంచి రూ.22 వేల వరకు పలుకుతోంది. 

రాజంపేట మండలం మందరం, కొత్తపల్లి, పెనగలూరు మండలం కోమంతరాజుపురం, నారాయణనెల్లూరు, నందలూరు మండలం పాటూరు, తోగురుపేట పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగుతున్నాయి. చెయ్యేరు నదిలో రాత్రి వేళల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. తాజాగా సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకు మందరం, కొత్తపల్లి గ్రామాల వద్ద ఉన్న చెయ్యేరు నది నుంచి రాజంపేట, చిట్వేలి ప్రాంతాలకు ఇసుక తరలించారు. ఈ విషయమై రాజంపేట ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి పవన్‌కుమార్‌ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు అందిందని, దాడులు చేసి యంత్రాలు, వాహనాలు ఉంటే జప్తు చేస్తామన్నారు. 


ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న తెదేపా నాయకులు

వీరబల్లి సమీపంలోని మాండవ్య నది నుంచి వైకాపా నాయకులు ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారని తెదేపా మండల నాయకులు అధికారులు, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తాజాగా మంగళవారం రాత్రి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న వాహనాలను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. రామాపురం మండలం రాచపల్లె పంచాయతీ మంగళపల్లె సమీపంలోని వంకలో ఎలాంటి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ.ప్రసాద్‌రెడ్డి తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు