logo

ప్రమాద వంతెన... ప్రయాణ యాతన!

పోరుమామిళ్ల - మైదుకూరు ప్రధాన రహదారిలోని వంకమర్రి సగిలేరు వంతెన శిథిలావస్థకు చేరింది. కాంక్రీటు లేచి గుంతలేర్పడ్డాయి.

Published : 03 Jul 2024 03:43 IST

ఈనాడు కడప,, న్యూస్‌టుడే, బద్వేలు:  పోరుమామిళ్ల - మైదుకూరు ప్రధాన రహదారిలోని వంకమర్రి సగిలేరు వంతెన శిథిలావస్థకు చేరింది. కాంక్రీటు లేచి గుంతలేర్పడ్డాయి. ఈ మార్గంలో బెంగళూరు, చెన్నై తెలంగాణ రాష్ట్రాలకే కాకుండా రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు, పుణ్యక్షేత్రాలైన బ్రహ్మంగారిమఠం, తిరుపతి, ఒంటిమిట్ట క్షేత్రాలకు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇవి రాకపోకలు సాగించేటప్పుడు వంతెన అదురుతుండడంతో కూలిపోతుందేమోనని వాహనచోదకులు భయాందోళనకు గురవుతున్నారు. వంతెన నిర్మించి నలభై ఏళ్లు కావడంతో వంతెన రక్షణగా ఉన్న సిమెంటు దిమ్మెలు దెబ్బతిన్నాయి. వంతెన పొడవునా కంకర లేచి లోతైన గుంతలు పడటంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని