logo

విద్యారంగ పరిరక్షణకు వినతి

విద్యారంగం పరిరక్షణకు సహకరించాలని కోరుతూ కడప నగరంలో మంగళవారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి యూటీఎఫ్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు.

Published : 03 Jul 2024 03:40 IST

కడప విద్య, న్యూస్‌టుడే : విద్యారంగం పరిరక్షణకు సహకరించాలని కోరుతూ కడప నగరంలో మంగళవారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి యూటీఎఫ్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్‌బాబు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అవలంభించిన విధానాలతో విద్యారంగం సంక్షోభంలో పడిందన్నారు. మెగా డీఎస్సీని నిర్వహించి నియామకాలు చేపట్టేలోగా ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు చేపట్టి బదిలీలు నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయ నియామకాల్లో అప్రెంటీస్‌ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, సీపీఎస్, జీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు. వీరి వెంట నాయకులు రవికుమార్, సుజాతరాణి, నరసింహారావు,  రమణ, చెరుకూరి శ్రీనివాసులు, ఏజాస్‌అహ్మద్‌ తదితరులున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని