logo

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రద్దు

విజయవాడ రైలునిలయం సమీపంలో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు జరుగుతున్న నేపథ్యంలో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు (వారం రోజుల పాటు) రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టరు ఎ.జనార్దన్‌ తెలిపారు.

Published : 03 Jul 2024 03:35 IST

5 నుంచి 11 వరకు 

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : విజయవాడ రైలునిలయం సమీపంలో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు జరుగుతున్న నేపథ్యంలో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు (వారం రోజుల పాటు) రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టరు ఎ.జనార్దన్‌ తెలిపారు. విశాఖపట్నం-కడప మధ్య నడిచే ఈ రైలు (17488) ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో కడప-విశాఖపట్నం మధ్య ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు రద్దయినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని