logo

విద్యార్థినుల అస్వస్థత ఘటనలో బాధ్య హెచ్‌ఎం సస్పెన్షన్‌

కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై బాలికల ఉన్నత పాఠశాల బాధ్య ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్‌ చేశారు.

Published : 03 Jul 2024 03:33 IST

ఇద్దరు ఎంఈవోలకు మెమో జారీ చేసిన డీఈవో

ఖాజీపేట, న్యూస్‌టుడే : కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై బాలికల ఉన్నత పాఠశాల బాధ్య ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్‌ చేశారు. పాఠశాలను తరచూ పర్యవేక్షించాల్సిన బాధ్యతను విస్మరించినందులకు ఎంఈవో నాగస్వర్ణలత, ఎంఈవో-2 నాగరాజులకు మెమో జారీ చేశారు.ఈ మేరకు డీఈవో అనురాధా మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. కాగా.. నీరు కలుషితం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారంటూ వైద్యులు ప్రాథమికంగా తేల్చి చెప్పారు.  

 సమగ్ర దర్యాప్తు అవసరం: డీఎల్‌

విద్యార్థినులు అస్వస్థతకు గురవడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన స్థానిక పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. వాంతులు, విరేచనాల బారిన పడటానికి కారణమేమిటన్న దానిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయినులు, సిబ్బందిని ఆరా తీశారు. పాఠశాలలోని నీటి ట్యాంకులను పరిశీలించారు. అక్కడ శుద్ధిజలం ఇవ్వడం లేదన్న విషయాన్ని గ్రహించారు. బాలికలకు అవసరమైన తాగునీటి కోసం తానే ఖర్చు భరించి వారికి శుద్ధిజలం అందిస్తానని హామీ ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని