logo

శీతంపేటలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ

అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదని తాటిగుంటపల్లి పంచాయతీ శీతంపేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 01 Jul 2024 04:04 IST

వీరబల్లి, న్యూస్‌టుడే: అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదని తాటిగుంటపల్లి పంచాయతీ శీతంపేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైకాపా పాలనలో గ్రామానికి చెందిన ఓ వైకాపా నేత గ్రామ సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రాళ్లు పాతారని.. ప్రజల అవసరాలకు  రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విషయమై తహసీల్దారు శ్రీనివాసరావును వివరణ కోరగా.. స్థానికుల నుంచి ఫిర్యాదు అందిందని విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని