logo

పెరిగిన దిగుబడులు దిగుతున్న టమాట ధరలు

మార్కెట్‌ యార్డుకు గత సోమవారం నుంచి క్రమంగా టమాట దిగుబడులు పెరుగుతున్నాయి.

Updated : 01 Jul 2024 05:38 IST

మార్కెట్‌కు 1,217 మెట్రిక్‌ టన్నుల రాక

మార్కెట్‌ యార్డులో రోడ్డుపై బాక్సులను పెట్టి టమాటాలను గ్రేడింగ్‌ చేస్తున్న కార్మికులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : మార్కెట్‌ యార్డుకు గత సోమవారం నుంచి క్రమంగా టమాట దిగుబడులు పెరుగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా 1,217 మెట్రిక్‌ టన్నుల టమాటాలను రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. దిగుబడి పెరగడంతో మండీల్లో స్థలం చాలక రోడ్డుపైనే బాక్సులను ఉంచి గ్రేడింగ్‌ చేయాల్సి వచ్చింది. టమాట రవాణా చేయడానికి వందల సంఖ్యలో లారీలు మార్కెట్‌లోకి రావడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. మార్కెట్‌ కార్యదర్శి అభిలాష్‌ వాహనాలను నియంత్రించారు. యార్డు ఎదుట జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి.
కిలో రూ.48కి టమాట : దిగుబడి పెరగడంతో టమాట ధర తగ్గుముఖం పట్టింది. మొదటి రకం 10 రోజులు క్రితం రూ.80 పలికింది. ప్రస్తుతం రూ.48కి తగ్గింది. వారం రోజుల నుంచి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని